KKR vs SRH: మళ్లీ అదే తీరులో సన్‌రైజర్స్.. ఈసారి కూడా ఓటమే మిగిలింది.! 6 d ago

IPL 18వ ఎడిషన్ లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) చేతిలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు ఘోర పరాజయం ఎదుర్కొంది. గత సీజన్ తో కలిపి వరుసగా 4 సార్లు SRH పై పైచెయ్యి సాధించింది. నిన్న జరిగిన మ్యాచ్‌లో కూడా 80 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ హ్యాట్రిక్ ఓటమితో SRH పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి చేరుకుంది. ఈ మ్యాచ్ విజయంతో KKR.. ఐదో స్థానానికి ఎగబాకింది. ఆడిన నాలుగు మ్యాచ్‌లలో రెండో విజయాన్ని నమోదు చేసింది.
తొలుత టాస్ గెలిచినా SRH కెప్టెన్ ప్యాట్ కమిన్స్.. హోమ్ టీమ్ అయిన KKR ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. ప్లేయర్ ప్లే లోనే రెండు కీలకమైన వికెట్లు కోల్పోవడంతో KKR మ్యాచ్‌పై ఆశలు వదిలేసుకుంది. KKR ఓపెనర్లు క్వింటన్ డి కాక్ (1).. సునీల్ నరైన్ (7) సింగిల్ డిజిట్ కే ఔట్ అయ్యారు.
మ్యాచ్ చేజారిపోయిందనుకున్న సమయంలో.. కెప్టెన్ అజింక్యా రహానే (38).. అంగ్క్రిష్ రఘువంశీ (50) అద్భుతంగా ఆడి.. 51 బంతుల్లో 81 పరుగుల భాగస్వామ్యంతో జట్టును మళ్లీ తిరిగి మ్యాచ్‌లోకి తెచ్చారు.
వీళ్లిద్దరు ఔట్ అయిన తరువాత బరిలోకి వచ్చిన వెంకటేష్ అయ్యర్ (60), రింకు సింగ్ (32) మెరుపులు పుట్టించారు.. వేసిన ప్రతి బంతిని బౌండరీలు కొట్టారు. 41 బంతుల్లో 91 పరుగులు చేసి.. జట్టుకు అద్భుతమైన స్కోరును అందించారు. ఈ లెఫ్ట్-హ్యాండర్స్ ధాటికి SRH బౌలర్లు తేలిపోయారు. KKR ఔరా మాస్ హిట్టింగ్ కి నిర్ణీత స్కోర్ 6 వికెట్ల నష్టానికి 200 కు చేరింది.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన SRH బ్యాటర్లు మళ్లీ అదే తీరుకనపరిచారు. ఒక్కరు కూడా నిలకడగా ఆడలేదు.. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన ట్రావిస్ హెడ్ (4) రెండవ బంతికే వెనుతిరిగాడు. ఈ మ్యాచ్‌లోనైనా రాణిస్తారనుకున్న అభిషేక్ శర్మ (2), ఇషాన్ కిషన్ (2) జట్టు స్కోరు పది రన్స్ కూడా కాకముందే పెవిలియన్ చేరారు. ఆ తర్వాత నితీశ్ కుమార్ రెడ్డి (19) కూడా తక్కువ పరుగులకే ఔట్ కావడంతో ఇక మ్యాచ్‌పై అభిమానులు ఆశలు వదిలేసుకున్నారు.
కామిందు మెండిస్ (27), హెన్రిచ్ క్లాసెన్ (33) కాసేపు నిలబడ్డా కానీ ప్రయోజనం లేకుండా పోయింది. KKR తరుపున ఇంపాక్ట్ ప్లేయర్ వైభవ్ అరోరా.. వరుణ్ చక్రవర్తి తమ అద్భుతమైన బౌలింగ్ తో SRH బ్యాటర్లను కుప్పకూల్చారు. వీళ్లిద్దరు కలిసి మూడేసి వికెట్లు తీసుకున్నారు. ఆండ్రీ రసెల్ 2, హర్షిత్ రాణా 1, సునీల్ నరైన్ 1 వికెట్ పడగొట్టారు.
KKR బౌలింగ్ ధాటికి SRH 16.4 ఓవర్లలో 120 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. ఈ విజయంతో KKR జట్టు మళ్లీ తన ఊపును పుంజుకుంది. SRH టీమ్ మళ్లీ ఫార్మ్ లోకి తిరిగి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. KKR ఈ విక్టరీతో పాయింట్ల పట్టికలో పైకి లేచింది.
టోర్నీలో భాగంగా ఈరోజు మరో ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరగనుంది. లక్నో వేదికగా ముంబై vs లక్నో మధ్య మ్యాచ్ జరగనుంది. గెలుపుతో తిరిగొచ్చిన ముంబై – ఓటమి తర్వాత పుంజుకోవాలనుకుంటున్న లక్నో... ఎవరు పైచేయి సాధిస్తారో చూద్దాం!